న్యూఢిల్లీ: యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ 72వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నేషనల్ కాంగ్రెస్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, డిఎంకే అధినేత స్టాలిన్, బిహార్ మాజీ మంత్రి తేజస్వీయాదవ్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ట్వీట్ చేయగా, ఢిల్లీ వచ్చి సోనియాను కలుస్తానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, కనిమొళిలు సోనియా నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సోనియాకు శుభాకాంక్షల వెల్లువ
RELATED ARTICLES