న్యూఢిల్లీ: సిబిఐ నూతన డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆలోక్ వర్మను తప్పిస్తూ ప్రధాని మోడీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత శుక్లాను నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలపై సిబిఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మను తప్పించారు. ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావును నియమించారు. నూతన డైరెక్టర్‌ను నియమించేందుకు ఇటీవల సమావేశమైన మోడా నేతృత్వంలోనే కమిటీ శుక్లాను ఎంపిక చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1983 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి శుక్లా సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే పశ్చిమ బెంగాల్ సమస్య సవాల్‌గా మారింది.
సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శుక్లా
RELATED ARTICLES