వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రత్యేక వైద్య బృందం వెల్లడి
లాహోర్: పాకిస్థాన్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రత్యేక వైద్య బృందం పరీక్షించింది. షరీఫ్ పూర్తి ఆరోగ్యంగా లేడని, అతడికి మరిన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యబృందం చెప్పింది. పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన వైద్యులు షహీద్ హమీద్, సజ్జద్ అహ్మద్, హమీద్ ఖలీల్‌లు షరీఫ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్ అజీజియా మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ లఖ్‌పత్ జైలులో ఏడు సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నారు. షరీఫ్ తన రెండు భుజాలు నొప్పి బాధపడుతున్నాడని వైద్యబృందం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ మాట్లాడుతూ ఆయన బాగా క్షీణించిందని, వైద్యులు ఆయనను పూర్తిగా పరీక్షించలేదని ఆరోపించారు. దీనిపై జైలర్ స్పందిస్తూ షరీఫ్‌కు డాక్టర్ల బృందం పూర్తి వైద్యపరీక్షలు నిర్వహించిందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.