బాహుబలితో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం, రుధిరం, రణం) మోస్టర్ పోస్టర్‌ను బుధవారంనాడు శ్రీశార్వరి నామ ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేశారు. ఇది విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్‌తో రికార్డులు సృష్టించింది. నిప్పు, నీరు, గాలి ప్రస్ఫుటంగా ప్రెజెంట్ అయ్యేలా వాయువేగంతో హీరోలు రామ్‌చరణ్, ఎన్‌టిఆర్‌లు కదులుతున్నట్లుగా చూపించే ఈ మోషన్ పోస్టర్ సినిమా రిచ్‌నెస్‌ను చెప్పకనే చెపుతున్నది. ఈ మోషన్ పోస్టర్ పట్ల సినిమా పరిశ్రమ యావత్తూ హర్షం వ్యక్తం చేసింది. మరో గొప్ప సినిమా తెలుగు తెరపై రాబోతున్నదని ప్రముఖులు వ్యాఖ్యానించారు.