HomeNewsLatest Newsదీనిని బట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ నెలకొందో ఊహించుకోవచ్చు

దీనిని బట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ నెలకొందో ఊహించుకోవచ్చు

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా చిత్రీకరించబడతున్న ‘రంగస్థలం’ సినిమా పై మెగా ఫాన్స్ అంతా ఎన్నో అంచనాలను పెంచుకుని, ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో రాంచరణ్ లుక్, టైటిల్ ఈ సినిమాపై పబ్లిక్ కి ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత చేస్తుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు అంతగా పెరగడానికి ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కూడా పెద్ద కారణమే. సుకుమార్ సినిమా అంటేనే ఒక లాజిక్. మరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఈ సినిమాలో ఎలాంటి లాజిక్ లు పెట్టాడో మన లాజిక్ డైరెక్టర్ అని అందరికి ఆశక్తిగానే ఉంటుంది. తాజా వార్తల ప్రకారం శాటిలైట్ రూపంలో ఈ చిత్రానికి భారీ ఆఫర్ వచ్చిందట.

డీల్ కూడా సెట్ అయ్యిందని 16కోట్లు ఆఫర్ ఇచ్చి ఓ ప్రముఖ చానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకోవడానికి నిర్మాతలతో చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. చర్చలు సఫలమవ్వడంతో త్వరలోనే అగ్రిమెంట్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యారట. దీనిబట్టి ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ నెలకొందో ఊహించుకోవచ్చు

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments