న్యూఢిల్లీ: రాఫెల్ విమానాల ధరలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లడుతూ రాఫెల్ విషయంపై రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. రఫేల్ విమానాల ధర రహస్యంగా ఉంచే విషయమేమి కాదని మేక్రాన్ చెప్పారు. మేడం(సీతారామన్) నేను మిమ్మల్ని లేదా పారికర్‌ను నిందితులుగా చూపించడం లేదు. ప్రధాని మోదీ ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి. నా ప్రశ్న ఒక్కటే. అనిల్ అంబానీకి ఈ కాంట్రాక్ట్ ఎలా వెళ్లింది. అంబానీకి కాంట్రాక్ట్ ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? రఫేల్ వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? ’’ ప్రశ్నించారు. అసలు రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టు అనిల్ అంబానీకి ఏ విధంగా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకుని తన స్నేహితుడైన అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా చేశారని ఆయన ఆరోపించారు. భారత ప్రజల సొమ్ము వివరాలను వాళ్లకే తెలియడం లేదు. హెచ్ఎఎల్కు దక్కకుండా అనిల్ అంబానీ ఈ కాంట్రాక్ట్‌ను ఎలా పొందారు? అని రాహుల్ ప్రశ్నించారు.
రాఫెల్ ధరలు రహస్యంగా ఉంచాల్సిన అవసరమేముంది?
RELATED ARTICLES