కరోనా నిరోధానికి ఆరు అంశాలపై 20 ప్రాజెక్టుల చేపట్టిన హైదరాబాద్ ఐఐటి
హైదరాబాద్‌కు చేరుకోక ముందే విదేశీయులకు కరోనా పాజిటివ్
నిజామాబాద్‌లో ఆంక్షలు మరింత కఠినం
నిర్మల్‌లో మరో మూడు పాజిటివ్ కేసులు
మూడు జోన్లుగా ప్రకటించి లాక్‌డౌన్ అమలు చేయాలన్న ఆలోచనలో కేంద్రం
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా తీవ్రత కొన్ని ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. దీంతో తాజాగా హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి మరిన్ని కొత్త నిబంధనలు విధించి కొత్తగా మరిన్ని ఆంక్షలను విధిస్తున్నారు. కరోఎనా నిరోదంపై దేశ వ్యాప్తంగా ఐఐటిలు దృష్టి సారించా యి. ఇందులో భాగంగా హైదరాబాద్ ఐఐటి ఆరు అ ంశాలపై 20 ప్రాజెక్టులు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వె లుగుచూస్తున్న కరోనా పాజిటివ్ కేసుల తగ్గుదల కనిపిస్తున్నప్పటికి నిజామాబాద్, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లు మాత్రం రోజురోజుకు ఆందోళనను అధికం చేస్తున్నాయి. తాజాగా ఆదివారం సా యంత్రం వరకు నిర్మల్ జిల్లాలో కొత్తగా మూడు, వికారాబాద్ జిల్లాలో రెండు కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశారు. వీటితో పాటు కొత్త ప్రాంతాలకు కూడా క రోనా వ్యాప్తి చెందుతుండడం, ఇప్పటి వరకు తక్కువగా ఉన్న చోట కూడా వ్యాప్తి పెరుగుతుండడంతో రాష్ట్రంలో హాట్‌స్పాట్‌ల సంఖ్య, రెడ్ జోన్ల సంఖ్య పెరిగింది. రా ష్ట్రంలో హాట్‌స్పాట్‌ల సంఖ్య 243కు పెరగగా వీటిలో 123 కేవలం హైదరాబాద్‌లోనే ఉండడం రాజధానిలో క రోనా తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో హాట్‌స్పాట్‌ల సంఖ్య 120కు చేరింది. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ జోన్ల సంఖ్య 174కు పెరిగింది. నిర్మల్ జిల్లాలో తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా అత్యధిక ప్ర భావం ఉన్న ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా శానిటైజేషన్ చే స్తున్నారు. ఈ విభాగంలో నిజామాబాద్ ఉండడంతో ఇ క్కడ ఆదివారం నుంచి ఆంక్షలు మరింత కఠిన చేశారు. డ్రోన్లతో శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. కూరగాయలు, నిత్యావసర దుకాణాలను మూసివేశారు. కంటాన్మెంట్, హాట్‌స్పాట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల కూడా కూరగాయలు, నిత్యావసరాలకు ఉదయం ఆరు గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతి ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 49కేసులు నమోదయ్యాయి. ఇవే నిబంధనలను రాష్ట్రంలో అత్యధిక కరోనా ప్రభావం ఉన్న మిగిలిన ప్రాంతాలలో కూ డా ఒకటి రెండు రోజుల్లో అమలుచేయనున్నారు. కంటాన్మెంట్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, వరంగ ల్ వంటి చోట్ల ఆయా ప్రాంతాలలో ఆంక్షలు మరింత క ఠినం చేశారు. వీటిని పూర్తిగా సీజ్ చేశారు. కామారెడ్డి జి ల్లాలో అంతర్‌జిల్లా సరిహద్దులను మూసివేశారు. ఇతర జిల్లాల నుంచి కామారెడ్డి జిల్లాకు, కామారెడ్డి నుంచి ఇతర జిల్లాలకు పూర్తిగా రాకపోకలు బంద్ చేశారు. మి గిలిన చోట్ల ఉన్న కంటాన్మెంట్ ప్రాంతాలలో ప్రస్తుతానికి ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. కూరగాయలు, నిత్యావసరాల దుకాణాలను కూ డా మూసి వేశారు. ఆదిలాబాద్‌లో మొత్తం 19 వార్డులను కంటాన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ వార్డులను మాత్రమే మూసి వేసి మిగతా ప్రా ంతాల నుంచి ఈ వార్డులకు రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం ఆంక్షలు మరింత కఠినం చేసి ఒక్కో వార్డును అయిదు జోన్లుగా విభజించి ఒక జోన్ నుంచి మరో జోన్‌కు కూడా బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు. కరీంనగర్ జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికి ఆ దివారం నుంచి నిబంధనలు, ఆంక్షలు మరింత ఎక్కువ చేశారు. ఇతర జిల్లాల నుంచి కరీంనగర్ జిల్లాకు వచ్చే వారిని కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లోని చొప్పదండి వద్దే వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లాలోకి అనుమతిస్తున్నా రు. నగరాల్లో, పట్టణాల్లో ఏదైనా ప్రాంతంలో పాజిటివ్ కేసు నమోదయితే ఆ ప్రాంతాన్ని లేదా ఆఇంటికి 500 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధిస్తుండగా పల్లెల్లో మాత్రం ఏదేని గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదై నా సరే మొత్తం గ్రామాన్నే క్వారంటైన్ చేస్తున్నారు. ఇ తర గ్రామాల నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నారు. హై దరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతంలో కొత్తగా 7 హాట్‌స్పాట్‌లను ప్రకటించారు. ఇక్కడ 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా, ఇరాన్ నుంచి హైదరాబాద్‌కు చాలా మంది వచ్చారని వీరంతా పంజాగుట్ట, ఆసిఫ్‌నగర్, నల్లకుంట తదితర ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించారని కేంద్రానికి నివేదిక పంపించారు. హైదరాబాద్‌కు రాకముందే కరోనా ఉందని నివేదికలో తెలిపారు.
వరంగల్‌లో వింత వైరస్ కలకలం.. దేశం, ప్రపంచమం తా కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతుంటే వరంగల్ అర్బన్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం మాత్రం ఒక వింత వైరస్‌తో కలవరపడుతోంది. ఇక్కడ వేపచెట్లు గత కొన్ని రోజులుగా ఎండిపోతూ నేలకొరుగుతున్నాయి. దీంతో గ్రామస్థులు భయపడి ఎవరు కూడా ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. ఈ గ్రామంలో 80 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి ఉన్న ఒ కటి రెండు వేప చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయి నేలకొరిగాయి. గత 20 రోజుల నుంచే ఈ పరిస్థితి ఈ గ్రామంలో నెలకొంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం చూపుతున్న వేళ తమ గ్రామంలో ఏదో వింత వైరస్ ఒ క టి చేరిందన్న ఆందోళనను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నా రు. వేపచెట్లు ఆక్సీజన్‌ను ఇస్తాయి. ఇలాంటి చెట్లు ఇలా ఎండిపోవడం అంటే భయంకరమైన వైరస్ ఏదో సోకే ఉ ంటుందన్న అనుమానాలు గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నా రు. అ యితే వర్షాలు పడిన తర్వాత మళ్లీ చిగురిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వేప చెట్లు ఎం డా కాలం ఎండిపోవు. మిగిలిన ఎన్నో చెట్లు ఎండిపో యి, ఆకు రా లిపోయినా.. మామిడి, వేప వంటి కొన్ని చెట్లు ఎండాకాలమే చిగురిస్తాయి. 40 ఏళ్ల క్రి తం తమిళ నాడులో ఇలాగే జరిగిందని వృక్ష శాస్త్రవేత్త లు చెబుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే… మహారాష్ట్ర అత్యధిక కరోనా వ్యాప్తితో దేశానికి గుబులు పుట్టిస్తోంది. ఇక్కడ మొ త్తం కేసుల్లో ఒక ముంబయి నగరంలోనే సగాని కం టే ఎక్కువగా ఉన్నాయి. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరున్న ధారావి నగరాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది.కేరళలో వందలాది హౌజ్ బోట్లను ఐసోలేషన్ వార్డులుగా చేశారు. తమిళనాడు, రాజస్థాన్‌లలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 8356 పాజిటివ్ కేసులు నమోదు కాగా 273 మంది మరణించారు. శనివారం ప్రధానమంత్రితో జరిగిన ముఖ్యమంత్రుల వీడి యో కాన్ఫరెన్స్‌లో
ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన ముఖ్యమంత్రులు ఈనెల 30వరకు లాక్‌డౌన్ ప్రకటించాలని ప్రధానికి తెలిపారు. ఇప్పటికే తెలంగాణతో సహా మ రో మూడు రాష్ట్రాలు ఏప్రిల్ 30వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించుకున్నాయి. అయితే కేంద్రం మాత్రం లాక్ డౌన్ విషయంలో ఉన్నత స్థాయిలో చర్చించి, నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు స మాచారం. ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం మే రకు దేశాన్ని మూడు జోన్లుగా ప్రకటించి లాక్‌డౌన్ అ మలు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. రెడ్ జో న్, ఆరేంజ్ జోన్, గ్రీన్ జోన్‌లుగా ప్రకటిం చి రెడ్ జో న్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, ఆరేంజ్ జోన్‌లో పరిమిత స్థాయిలో లాక్‌డౌన్, గ్రీన్ జోన్‌లో కేవలం సోషల్ డిస్టెన్సి ంగ్ పాటింప చేయడం తప్ప లాక్‌డౌన్ ఎత్తివేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని సమాచారం.