హైదరాబాద్: తెలంగాణలో ప్రజాఫ్రంట్‌దే విజయమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ ధీమా వ్యక్తంచేశారు. 65 నుంచి 80 స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జాతీయ మీడియా దక్షిణ భారతదేశ నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయిందన్నారు. కెసిఆర్ ప్రగతిభవన్ వదిలేసేందుకు ముహూర్తం చూసుకోవాలని చెప్పారు. తమ నేతలు రేవంత్ ఇంటిపై, మధుయాష్కీ, వంశీ చంద్‌రెడ్డిపై అసహనంతో దాడులు చేశారని ఆరోపించారు. ఈ నెల 11వ తేదీ లెక్కింపు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నియంత పాలనను గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని తమకు విశ్లేషణలు వస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ భృతి, తాము చేపట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తున్నామని వివరించారు.
ప్రజాఫ్రంట్‌దే విజయం
RELATED ARTICLES