బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై పోలీస్ కేసు నమోదైంది. మార్చి 12న బెంగళూరులోని మహత్మ గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ‘మీడియా మరియు భావ ప్రకటన స్వేచ్ఛ’ అనే అంశంపై ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. అయితే అనుమతి లేకుండా ఈ సమావేశంలో ప్రకాశ్ రాజ్ ఓట్లు అభ్యర్థించారని.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్ తాను రాజకీయ సమావేశంలో పాల్గొనలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై మాత్రమే మాట్లాడానని తెలిపారు. అంతేకాకుండా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు.
ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు
RELATED ARTICLES