HomeNewsLatest Newsఒక‌పూట భోజ‌నం మానెయ్యండి!

ఒక‌పూట భోజ‌నం మానెయ్యండి!

బిజెపి కార్యకర్తలకు ప్రధాని మోడీ సూచ‌న‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై సాగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు బిజెపి కార్య‌క‌ర్త‌లు ఒక పూట భోజ‌నం మానేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బిజెపి కార్య‌క‌ర్త‌లు దీన్నొక టాస్క్‌గా ప‌రిగ‌ణించాల‌ని కోరారు. సోమ‌వారంనాడు బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని.. వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. కొవిడ్ పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు.  అంతకుముందు పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. లాక్ డౌన్ తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలపాలన్నారు. అందులో భాగంగా ఒకపూట భోజనం మానెయ్యాలని పిలుపునిచ్చారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని కోరారు. పోలింగ్ కేంద్రం స్థాయిలో ప్రతిఒక్కరూ మరో ఇద్దరికి మాస్క్ లు అందజేయాలని సూచించారు. పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించాలని కోరారు. ఈ కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ధన్యవాద లేఖలు అందించాలన్నారు. స్థానికంగా కరోనాకు వ్య‌తిరేకంగా పోరాడుతున్న వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయాల‌ని న‌డ్డా కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments