న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో తాత్కాలిక బాధ్యతలు పీయూష్ గోయల్ చేపట్టారు. కాగా.. ఆర్థిక మంత్రిగా రెండోసారి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన గోయల్.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. గత ఐదు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండంతో గోయల్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గతేడాది మే నెలలో అరుణ్‌జైట్లీ కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించారు. 2018 మే నుంచి ఆగస్టు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇటీవల జైట్లీ మరోసారి అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో గోయల్ మళ్లీ తాత్కాలిక ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ హోదాలో శుక్రవారం నాడు లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయెల్
RELATED ARTICLES