హైదరాబాద్: టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్‌ను నియమించడంపై టిఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కెటిఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని హరీశ్ ఆకాంక్షించారు. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కెటిఆర్.. హరీశ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీష్ కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌కు కెటిఆర్ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మరింత బాగా పనిచేయాలని, పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ విషయంలో తన సంపూర్ణమైన సహకారాన్ని కెటిఆర్‌కు అందిస్తాన్నారు. పార్టీలో మొదటి నుంచి ఇద్దరం కలిసి పనిచేశామని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలోనూ కలిసే పనిచేస్తామని చెప్పారు.
కెటిఆర్‌కు సంపూర్ణ సహకారం
RELATED ARTICLES