హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 12,680 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 16.7 శాతం సర్పంచ్ పదవులకు, 126.4 శాతం వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విపరీతమైన చలిలోనూ అందరూ ఉత్సాహంగా పంచాయతీ ఎన్నికలు పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఒక్క టెండరు ఓటు పడినా పరిశీలకుల అనుమతితోనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేశామని వివరించారు. నాలుగు చోట్ల టెండర్ ఓటు వల్ల రీపోలింగ్‌కు వెళ్లినట్టు చెప్పారు. ఒకచోట ఏకగ్రీవం కోసం వేలం జరిగినట్లు గుర్తించి ఎన్నిక రద్దు చేశామన్నారు. అభ్యర్థులు, అధికారులు, ఓటర్ల కోసం తెలుగులోనూ బుక్లెట్స్ ప్రచురించి ఇచ్చామన్నారు.
12,680 పంచాయతీలకు ఎన్నికలు పూర్తి
RELATED ARTICLES