HomeNewsలీటర్ పెట్రోలు ౩౦ రూపాయలు మాత్రమే... మన ఇండియాలోనే...

లీటర్ పెట్రోలు ౩౦ రూపాయలు మాత్రమే… మన ఇండియాలోనే…

అమెరికన్ భవిష్యకారుడు టోనీ సెబా ప్రకారం ఐదు సంవత్సరాలకు లీటరు పెట్రోల్‌ రూ. 30 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని చెప్పడంతో ఈ వార్త హల్చల్ గా మారింది. ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే, చమురు డిమాండ్‌ గణనీయంగా తగ్గనుందని తెలుస్తుంది. సెబా అంచనా ప్రకారం… 2020 నాటికి చమురు గిరాకీ గరిష్ట స్థాయి 100 మిలియన్ బారెల్స్‌కు వెళ్లి, పది సంవత్సరాలలో 70 మిలియన్ బారెల్స్ పడిపోతుంది. చమురు బ్యారెల్‌ ధర త్వరలోనే 25 డాలర్లకు దిగిరానుందని అంటున్నారు.
విద్యుత్ ఆధారిత కార్ల వినియోగం భారీగా పెరగటంతో పాటు, ఈ కార్ల ధరలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని సెబా అంటున్నారు. అంతే కాకుండా 95శాతం ప్రజలు ప్రైవేటు వాహనాలకు 2030నాటికి గుడ్ బాయ్ చెబుతారని, దీంతో ఆటో మొబైల్‌ పరిశ్రమ తుడిచుపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు విద్యుత్తు వాహనాల రాకతో ప్రపంచ ముడి చమురు పరిశ్రమ కుదేలవుతుందని అంచనావేశారు.
సౌర శక్తి మీద సేబా ఊహ నిజం కావడంతో చమురు ధరల భవిష్యత్తు పై అంచనాలు కూడా నిజంకావచ్చని భావిస్తున్నారు. ఈయన సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకుడు, స్టాన్‌ఫర్డ్ కాంటినెనింగ్ స్టడీస్ ప్రోగ్రాంలో డిస్ప్ప్షన్ అండ్ క్లీన్ ఎనర్జీలో బోధకుడుగా ఉన్నారు. సీఎన్‌బీసీ మీడియాతో సెబా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.15 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారు విక్రయించబడదని, 2030 నాటికి భారతదేశం లో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ ఇటీవలి వ్యాఖ్యలు చేసారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments