హైదరాబాద్: బుధవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఆస్తి నష్టపో్యిన వారితోపాటు ఎగ్జిబిషన్ కమిటీ కూడా తీవ్రంగా బాధపడుతోందని తెలిపారు. గురువారం నాడు ఈటల అధ్యక్షతన నాంపల్లి ఎగ్జిబిషన్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టంపై చర్చించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ నుంచి వ్యాపారులు ఏ ఆశతో వచ్చారో అదే ఆశతో వెళ్లేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. నలభై ఏళ్లుగా స్టాళ్ల నిర్వాహకులతో తాము కుటుంబంగా కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రమాదం దృష్ట్యా గురు, శుక్ర వారాల్లో రెండు రోజులపాటు ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నట్లు ఈటల ప్రకటించారు. స్టాళ్లను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. స్టాళ్ల యాజమానులకు భోజనం ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై నివేదిక వస్తుందని.. త్వరగా సహాయం చేస్తామని ఆయన వివరించారు. ఇబ్బందుల దృష్ట్యా నుమాయిష్‌కు నాలుగైదు రోజులు గడువు పొడిగిస్తామని ఈటల చెప్పారు.
రెండు రోజులు నుమాయిష్ నిలిపివేస్తున్నాం
RELATED ARTICLES