హైదరాబాద్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం ఉపసభాపతి ఎన్నికను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పదవికి మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ రోజు ప్రారంభమైన శాసనసభ, మండలి సమావేశాలు వాయిదాపడ్డాయి. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది. రేపు, సోమవారం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రేపు బడ్జెట్‌పై.. సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు.
రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
RELATED ARTICLES