HomeNewsBreaking Newsటెస్టు కిట్లు లేవు!

టెస్టు కిట్లు లేవు!

అమెరికాకు మళ్లింపే కారణం
కరోనా క్లస్టర్‌ ఏరియాలకు షాక్‌

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండగా మరోవైపు టెస్టు కిట్లు లేక వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూఢిల్లీలో ఆదివారంనాడు ఈ అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. క్లస్టర్‌ ఏరియాల్లో కరోనా వైరస్‌ టెస్టింగ్‌ టూల్స్‌ లేనందువల్ల పరీక్షలకు సమస్యలు ఎదురయ్యాయని, ఈ రాపిడ్‌ స్క్రీనింగ్‌ కిట్స్‌ను అమెరికాకు తరలించడం వల్లనే అనుకోకుండా ఈ కొరత ఏర్పడిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసిఎంఆర్‌) వర్గాలు అంగీకరించాయి. రోగులకు చికిత్స అందించడానికి ఓవైపు డాక్టర్లు ఎంతో శ్రమిస్తుండగా, మరోవైపు రాపిడ్‌ స్క్రీనింగ్‌ కిట్స్‌ను  అందుబాటులో ఉంచకపోవడం విచిత్రమని ఆ వర్గాలను ఉటంకిస్తూ సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ఒక కథనం ప్రసారం చేసింది. ఇదే కథనం సంబంధిత ఛానల్‌ వెబ్‌సైట్‌లోనూ పోస్ట్‌ చేసింది. “టెస్టు కిట్లు లేవని ప్రతిరోజూ రాష్ట్రాలు మాకు ఫిర్యాదులు చేస్తున్నాయి. కస్టర్లు, జిల్లాల్లో వీలైనంత త్వరగా లాక్‌డౌన్‌ ఎత్తేయడానికి ఈ సర్వీలెన్స్‌ టెస్టు చాలా ఉపయోగపడుతుందని, త్వరితగతిన పరీక్షలు పూర్తవుతాయని ఐసిఎంఆర్‌కు చెందిన శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ఒక విధంగా ఈ కొరత లాక్‌డౌన్‌కు ఎదురుదెబ్బగా వ్యాఖ్యానించారు. కొన్ని కన్సయిన్‌మెంట్లు అమెరికాకు మళ్లించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ఆ శాస్త్రవేత్త అంగీకరించారు. కొవిడ్‌ 19 ఒక వ్యక్తిలోని నిర్ధిష్టమైన పాథజెన్‌కు విస్తరించిందా లేదా అని నిర్ధారించడానికి ఉపకరించే ఈ వైద్యపరీక్ష చేతివేలి నుంచి సేకరించే రక్తం నమూనాకు పరీక్షలు చేస్తారు. దీన్ని సెరోలాజికల్‌ టెస్టులని పిలుస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 90 మంది డాక్టర్లు, పారామెడికల్‌ స్టాఫ్‌ టెస్టు కిట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెపాపరు. ఈ కొరత వల్ల మహారాష్ట్రలో సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా ప్రభావం అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్న విషయం విదితమే. దేశంలో కొత్తగా మరో 80 జిల్లాలకు కరోనా విస్తరించింది. దీతో కరోనా ప్రభావిత జిల్లాల సంఖ్య 364కి పెరిగింది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో వుంటుంది. తీవ్రంగా మరణాలను ఎదుర్కొంటున్న అమెరికా విజ్ఞప్తి మేరకు భారత్‌ నుంచి ఆ దేశానికి హైడ్రోక్సీక్లోరోక్విన్‌ మాత్రలతోపాటు వివిధ మెడికల్‌ కిట్లు ఎగుమతి అయ్యాయి. అసలే మన దేశంలో కిట్లు లేక ఇబ్బందులు పడుతుంటే, వీటి ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని మోడీ సర్కారు ఎత్తివేసింది. ఇది తీవ్రమైన పరిస్థితికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments