హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల సందర్భంగా నిర్వహించే ఆశీర్వాద సభలకు స్పందన కొరవడుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం, ప్రజాఫ్రంట్‌కు ఆదరణ విశేషంగా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. 200 నుంచి 1000 రూపాయల వరకు డబ్బులిచ్చినా జనాలు దొరకడం లేదని, జనసమీకరణ చాలా కష్టంగా వుందని ఆ పార్టీ వర్గాలే స్వయంగా చెపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన కెసిఆర్ ఆశీర్వాద సభే అందుకు తార్కాణం. ఈ మధ్య హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన కెసిఆర్ సభ అట్టర్‌ఫ్లాప్ అయింది. జనాలు లేక సభ వెలవెలబోయింది. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఓవైపు కెసిఆర్ ప్రసంగిస్తుండగా, మరోవైపు ఖాళీకుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఓసారి ఈ వీడియో చూడండి!
https://youtu.be/FFftIBaSB8M