HomeNewsBreaking Newsరాష్ట్రంలో నో మూవ్‌మెంట్‌ జోన్లు

రాష్ట్రంలో నో మూవ్‌మెంట్‌ జోన్లు

సరుకులు, మందులు ఇంటికే సరఫరా
బఫర్‌ జోన్లలో మరింత కఠిన ఆంక్షలు
మిగతా ప్రాంతాలతో సంబంధాలు కట్‌
కరోనా వ్యాప్తిలో దేశంలో నాలుగో స్థానంలో తెలంగాణ

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఢిల్లీ ప్రకంపన లు అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు మర్కజ్‌ వెళ్లి వచ్చి న వారి పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నారని ఇదివరకే గుర్తించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 334 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటిలో దాదాపు సగం 163 కేసు లు హైదరాబాద్‌వే కావడం గమనార్హం. ఆదివారం ఒక్క రోజు రాష్ట్రంలో 62 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీటి లో 52 కేసులు హైదరాబాద్‌వే కావడం ఇక్కడి తీవ్రతను తెలియచేస్తోంది.దీంతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల పై గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలును లైవ్‌ వీడియో పంపించాలని కేంద్రం ఆదేశించింది..  రా ష్ట్రంలో గడిచిన పది రోజుల్లో అయిదు రెట్లు కరోనా కేసు లు పెరిగాయి. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుం డా అంచెలంచలుగా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బఫర్‌ జోన్లలో ఆంక్షలను మరింత కఠిన తరం చేశారు. దేశ వ్యాప్తంగా బఫర్‌ జోన్లను గుర్తించి వా టి వివరాలను రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. ఈ జోన్‌లకు బయట ప్రాంతాలతో సంబందాలు కట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కొన్ని ప్రాంతాలను  నో మూవ్‌మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. వరంగల్‌ జిల్లాలో 15 నో మూవ్‌మెంట్‌ జోన్లను ప్రకటించగా, సూర్యాపేట ఇతర జిల్లాల్లోనూ నో మూవ్‌మెంట్‌ జోన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్లలో ఇళ్ల నుంచి ఎవరిని బయట కు రానివ్వరు. వారికవసరమైన సరుకులు, మందులు ఇళ్లకే పంపిణీ చేస్తారు. మర్కజ్‌కు వెళ్లి ప్రార్థనలు చేసిన వారినందరిని గుర్తించి ఐసోలేషన్‌, క్వారంటైన్‌లో ఉం చామని రాష్ట్ర ప్రభుత్వం గత అయిదారు రోజులుగా చె బుతోంది. అయితే ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఇప్పటికి మర్కజ్‌ డైరెక్ట్‌ కాంటాక్ట్‌ వారినే మొత్తం గుర్తించలేదని స్పష్టమవుతోంది. తొలుత మర్కజ్‌ వెళ్లి వ చ్చిన వారు 1030 మంది అని ప్రకటించగా రెండు రోజు ల క్రితం వీరి సంఖ్య 1090 అని ప్రకటించింది. ప్రస్తు తం అధికారికంగా ప్రకటించకున్నా అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు వీరి సంఖ్య 1100 అని తెలుస్తోంది. ఫస్ట్‌ కాంటాక్ట్‌ కేసుల విషయంలోనే స్పష్టత రాకపోగా అప్పుడే రెండో దశ కాంటాక్ట్‌ కేసుల విచారణ మొదలుపెట్టారు. మర్కజ్‌ నుంచి వచ్చి ఇప్పటికే 15రోజులు అవుతోంది. వీరు వచ్చి ఎక్కడెక్కడికి వెల్లారు, ఎవరిని కలిసారు, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా గుర్తించని వారి విషయంలో ఈ వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటికే 15రోజులు గడిచిపోవడంతో వారిని గుర్తించే లోపే పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు చికిత్సకు రాకముందే చనిపోయే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నా యి. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత కరోనా పాజిటివ్‌ తేలుతున్న వారి సంఖ్యలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 24 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా దాదాపు 19 మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారివేనని అధికారులు చెబుతున్నారు. ములుగులో కరోనా లక్షణాలు లేకున్నా ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. డిల్లీ ప్రార్థనలకు ముందు రాష్ట్రంలో అయిదు నుంచి ఆరు జిల్లాల్లో వెలు గు చూసిన కరోనా ఢిల్లీ ప్రార్థనల వ్యవహారం వెలుగుచూసిన తర్వాత 25 జిల్లాల్లో కరోనా వేగంగా కరోనా వ్యాప్తి చెందింది. దీంతో మర్కజ్‌ ప్రార్థనలు రాష్ట్రంలో ఏమేరకు కరోనా మంటలు సృష్టిస్తోందో అర్థమవుతోంది. నిజామాబాద్‌ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వమే రెడ్‌ జోన్లుగా ప్రకటించగా ఇక్కడ  భద్రతను మరింత కట్టుదిట్టం చేశా రు. కామారెడ్డి, నందిపేటలను బఫర్‌జోన్లుగా ప్రకటించారు. పొరుగున ఉన్న ఏపిని సైతం మర్కజ్‌ వ్యవహారం  అతలాకుతలం చేస్తోంది. గడచిన 12 గంటల్లో 14 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అంటే గంటకు ఒకరికి పైగానే పాజిటివ్‌ ఈ రాష్ట్రంలో వెలుగుచూస్తోంది. ఇప్ప టి వరకు అయిదారు కేసులు మాత్రమే నమోదైన కర్నూ ల్‌ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యా హ్నం వరకు  56 పాజిటివ్‌ కేసులు కొత్తగా బయటపడ్డాయి. ఆదివారం వరకు రాష్ట్రంలో అతి తక్కువ కరోనా ఉన్న జిల్లాల్లో ఒకటిగా కర్నూల్‌ ఉండగా అతి ఎక్కువగా ఉన్న జిల్లాగా కృష్ణా, దాని తర్వాత నెల్లూరులు ఉన్నా యి. అలాంటిది సోమవారం ఈ రెండు జిల్లాలను దాటి కర్నూల్‌ మొదటి స్థానంలోకి రాగా కృష్ణా 34, నెల్లూరు 32 పాటివ్‌ కేసులతో తర్వాత స్థానంలో ఉన్నాయి. దీంతో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాజిటివ్‌ కేసులు ఉన్న ఇళ్లకు కిలోమీటర్‌ దూరం వరకు రాకపోకలను బంద్‌ చేసింది. హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో ర్యాపిడ్‌ సర్వే, టెస్ట్‌లు నిర్వహించనుంది. అంతే కాదు ఆయా ప్రాంతాలలో టెలిమెడిసిన్‌ సౌకర్యం కల్పించనుంది. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే ఇప్పటి వరకు మొత్తం 4067 పాజిటివ్‌ కేసు లు వెలుగుచూసాయి. 292 మంది కోలుకుని డిస్చార్జి అయ్యారు. మహారాష్ట్ర 781 పాజిటివ్‌ కేసులతో మొదటి స్థానంలో ఉండగా ఇక్కడ 109 మంది మరణించారు. ఈ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు తీవ్రత పెరిగింది.   571 పాజిటివ్‌ కేసులతో రెండో స్థానంలో ఉంది. తమిళనాడులోని మొత్తం 571 పాజిటివ్‌ కేసుల్లో 522 మర్కజ్‌ ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారివే. ఢిల్లీలో మరో 503 మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన వారిని గుర్తించగా వీరిలో 70 మంది ఆచూకి తెలియడం లేదు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments