న్యూఢిల్లీ : లాక్‌డౌన్ ను పొడిగించే అవకాశం లేదని కేంద్రం ప్రకటించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ను మరికొన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని పేర్కొంది. అలాంటి(లాక్ డౌన్ పొడగింపు) ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్ డౌన్ పొడగించే యోచనేమీ లేదు అని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. కరోనా వైరస్ దేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గత మంగళవారం 21రోజుల లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి దేశవ్యాప్తంగా జనసంచారంపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా కొత్తగా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే లాక్‌డౌన్ ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 1071కు చేరగా.. మృతుల సంఖ్య 29గా నమోదైనట్లు కేంద్రం తెలిపింది.
లాక్‌డౌన్ పొడిగించబోం
RELATED ARTICLES