26 జిల్లాలపైనే కరోనా ప్రభావం ఎక్కువ
హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసుల నమోదులో 453 (గురువారం సాయంత్రం వరకు) కేసులతో 4వ స్థానంలో ఉంది. నిన్నమొన్నటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు భావించినా తాజాగా ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో ఎక్కువగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వైద్యారోగ్య శాఖ నిత్యం విడుదల చేస్తున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలు రాష్ట్రంలో 7 జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొమురంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, నారాయణపేట్ జిల్లాలు కరోనా కేసు నమోదు కాని జిల్లాలుగా రాష్ట్రంలో నిలిచాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో కరోనా వైరస్ ప్ర భావం 26 జిల్లాలకే పరిమితమైంది. ప్ర భుత్వం బుధవారం ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్ర కారం ఈ 7 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది. దీంతో ఆ 7 జిల్లాల ప్రజలతోపాటు స్థానిక అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈనెల 7వ తేదీ వరకు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఖమ్మంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఈనెల 8వ తేదీన ప్రకటించిన కేసుల వివరాల్లో ఖమ్మం జిల్లాలోనూ 2 కరోనా కేసులు తప్పా ఈ ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం జిల్లా వాసులు, అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. రా బోయే రోజుల్లో కూడా కరోనా కేసులు నమోదు కాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇళ్లనుండి ఎవ్వరూ బయటకు రా కు ండా కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.
నగరానికి ఆనుకొని ఉన్నా…
ఇప్పటి వరకూ 26 జిల్లాలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే 161 కేసులు నమోదయ్యాయి. బుధవారం వరకు మొత్తం 11 మంది మరణిస్తే అందులోనూ హైదరాబాద్‌కు చెందిన వారే అధికం. తరువాత వరుసలో నిజామాబాద్ జిల్లాలో 39 కేసులు, రంగారెడ్డిలో 27, వరంగల్ అర్బన్‌లో 23, జోగులాంబ గద్వాల జిల్లాలో 22 కేసులతో ముందు వరుసలో ఉన్నాయి. మొత్తం 26 జిల్లాల్లో కరోనా కేసులు నమోదైతే అందులో 11 జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య రెండెంకల సంఖ్యకు చేరుకున్నాయి. జగిత్యాల, జనగామ, సూర్యాపేట, సిద్ధిపేట, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ ఇతర మరికొన్ని జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాని ఈ ఏడు జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాలు నగరానికి ఆనుకునే ఉంటాయి. వరంగల్, యాదాద్రి, వరంగల్ రూరల్ హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్నాయి. అయినా కానీ ఈ జిల్లాల్లో కేసులు నమోదు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా…ఆయా జిల్లావాసులకు మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయా జిల్లాల్లో ముందస్తుగా అక్కడి పోలీసు, వైద్య, రెవెన్యూ, పారిశుద్ధ్య ఇతర విభాగాల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం సత్ఫలితాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్రం తేరుకొని ముందస్తుగా లాక్‌డౌన్‌ను ప్రకటించడం, అనుమానితులు సంచరించకుండా క్వారంటైన్‌కు తరలించడం జరిగింది. విదేశాలను నుంచి వచ్చిన వారిని ఇళ్లకే పరిమితమయ్యేలా ముందస్తు చర్యలు చేయడం కూడా ఈ జిల్లాలు కరోనా సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.