లాక్డౌన్ కొత్త మార్గదర్శకాల పట్ల సిపిఐ అసంతృప్తి
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో లాక్డౌన్తో కష్టాల ఊబిలో కూరుకుపోయిన వలసకార్మికులు, నిరుపేదలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ విమర్శించింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిందని, రోజువారీ కూలీలు, వలస కార్మికులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది తదితర సామాన్య ప్రజలు తీవ్రమైన కష్టాల్లో పడ్డారని, వారిలో ఏ ఒక్కరి గురించైనా తాజా మార్గదర్శకాల్లో ప్రస్తావించారా అని ప్రశ్నించింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం బుధవారంనాడొక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం లాక్డౌన్కు సంబంధించి అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాల పట్ల సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. వలస కార్మికులకు తక్షణమే ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందించాల్సిన అవసరం వుందని, ఎంఎస్ఎంఇలు, ఇతర చిన్న సంస్థల్లో పనిచేసే కార్మికులు సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించాలన్నా, రోజవారీ కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నింపాలన్నా ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు అవసరమైన చేయూతను ప్రభుత్వం ఇవ్వాలని కోరింది. 20 అంశాల మార్గదర్శకాల్లో ఈ అంశాలను జోడించాలని డిమాండ్ చేసింది. కొవిడ్ 19 సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఈ అంశాన్ని ముందు అత్యవసరంగా పరిగణించాలని కోరింది. అలాగే ఉపాధి హామీకి ప్రభుత్వం తగినంత ఆర్థిక తోడ్పాటునివ్వాలని, తద్వారా గ్రామీణ పేదలకు సకాలంలో పని, వేతనం లభిస్తాయని అభిప్రాయపడింది. అన్ని రాష్ట్రాలకు సహాయకారిగా వుండేలా, పిడిఎస్ ద్వారా ఉచిత ఆహార సరఫరాలు చేయడంతోపాటు ఆరోగ్య రక్షణ, చికిత్స కోస అవసరమైన వైద్యపరికరాలు సరఫరా చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులందర్నీ ఆదుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది.
అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం బట్టబయలు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ)కు నిధులను నిలుపుదల చేస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనను సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ద్వేషపూరిత చర్య తీవ్రమైనదని వ్యాఖ్యానించింది. కొవిడ్ 19ను ఎదుర్కోవడంలో హూ విఫలమైందని, తన ప్రాథమిక విధులను కూడా వదిలేసిందని ట్రంప్ ఆరోపించడం, వెంటనే నిధులను కూడా ఆపేయడం అమెరికా సామ్రాజ్యవాద దురహంకారాన్ని బట్టబయలు చేసిందని సిపిఐ వ్యాఖ్యానించింది. కరోనాకు అత్యధిక స్థాయిలో మూల్యం చెల్లించుకుంటున్న అమెరికాలో ఆ వ్యాధిని అదుపు చేయడంలో విఫలమైన ట్రంప్, ఈ వైఫల్యాన్ని డబ్ల్యుహెచ్ఓపై నెట్టడం దారుణమని పేర్కొంది.
New Lockdown Guidelines Ignore Suffering Masses: CPI
The National Secretariat of the Communist Party of India (CPI) issued the following
statement today (on April 15, 2020) on the new lockdown guidelines:
The National Secretariat of the Communist Party of India finds that the fresh guidelines issued
by the government of India on April 15, 2020, after extending the lockdown till May 3, totally
ignores the suffering masses especially the migrant labour and daily wage-earners including
para-medical staff in private hospitals. Mere lip service that no one be denied wages is not
going to yield any desired result and boost any entrepreneur big or small to get engaged in
business activities.
The Party feels that the 20-point guidelines issued by the government do not consider at all the
problem of migrant workers and their inability to fetch food and other essential goods. The
government should have extended all necessary help, including monetary one as done in most
other countries so that both the workers including daily wage-earners and MSMEs get
confidence to re-start normal life and work which are the most essential for the country at this
time of grave crisis to fight COVID-19 successfully.
The government should immediately ensure adequate financial support for Mahatma Gandhi
National Rural Employment Scheme (MGNREGS) so that the rural poor get work and timely
payments.
The government must without any further delay declare a financial package, provide adequate
medical equipment for protection and treatment, help states in getting adequate food supplies to
distribute through PDS free to all needed. The Party demands the government to take all such
necessary steps to mitigate the sufferings of the people due to lockdowns.
———————————————————————————————————————————————————
Trump Proves A Naked Imperialist Aggressor By Stopping Funds to WHO: CPI
The National Secretariat of the Communist Party of India (CPI) issued the following
statement today (April 15, 2020) severely condemning US President Donald Trump’s halting
of its share of funding to the WHO:
The National Secretariat of the Communist Party of India severely condemns in unequivocal terms
the US halting on April 14, 2020, of its share of funding to the World Health Organization.
President Donald Trump had the cheek to accuse the global body of mismanaging the COVID-19
pandemic. The US, the worst-hit country by far in the pandemic, also the organisation’s biggest
funder alleged that “the WHO failed in its basic duty and it must be held accountable.”
Reports say Trump further charged that ‘had WHO done its job to get medical experts into China
to objectively assess the situation on the ground and to call out China’s lack of transparency, the
outbreak could have been contained at its source with very little death’.
The Party feels that at this time of global crisis in all sectors of activities and even to human life
itself, Trump’s unilateral move of skin-saving for delayed shutdown action by pointing fingers at
WHO smacks of being a naked imperialist aggressor against multi-lateral global agency, engaged
in global public health activities.