న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన లోక్‌సభలో మాట్లాడారు. వృద్ధిరేటులో 11వ స్థానంలో ఉన్న భారత్ 6వ స్థానానికి చేరిందన్నారు.
బడ్జెట్‌లో కొన్ని ప్రధానాంశాలు
* 2022 నాటికి నవ భారత నిర్మాణం దిశగా ప్రయాణం
* వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నాం
* ఆర్థిక అస్థిరత తిరోగమనానికి పక్కా ప్రణాళిక
* ప్రపంచంలోనే అత్యంత శీఘ్రంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్
* గతం కన్నా గడిచిన ఐదేళ్లలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరుగుదల
* గత ఐదేళ్లలో ఆకర్షణీయమైన ప్రదేశంగా భారత్‌కు గుర్తింపు
* ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలోనే రెండక్షరాల ద్రవ్యోల్బణం అదుపు
* జిడిపిలో ద్రవ్యలోటు 3.4 శాతం
* జిఎస్‌టి ఇతర సంస్కరణల ద్వారా వ్యవస్థీకృత సంస్కరణలకు దిశానిర్దేశం
* ‘ఆటోమేటిక్ రూట్’ ద్వారా మరిన్ని పెట్టుబడులకు అనుమతినిస్తూ ఎఫ్‌డిఐ విధానం సరళీకృతం
* పెద్దపెద్ద కార్పొరేట్ రుణ ఎగవేతదారుల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలను రాబట్టాం
* ఆర్‌బిఐ పిసిఎ చట్రం నుంచి బిఓఐ, ఓబిసి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను తొలగించాం
* అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడిపాం
* దేశంలో 98 శాతానికిపైగా గ్రామీణ పారిశుద్ధ్యాన్ని సాధించాం
* రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, 2016 రియాలిటీ చట్టం రెరా తీసుకువచ్చాం
* దేశ వనరులపై పేదలకు తొలి హక్కు కల్పించాలన్నది మా లక్ష్యం
* దాదాపు 5.4 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా గుర్తింపు
* పట్టణ, గ్రామాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి కృషి
* ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్, విద్యాసంస్థల్లో 2 లక్షల సీట్లు కల్పించేందుకు జాబ్ కోటా వర్తింపు
సన్న, చిన్నకారు రైతులకు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ఏర్పాటు, రైతులకు ప్రతియేటా రూ. 6,000 రూపాయలు నగదు, ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు వర్తింపు. యేటా మూడు విడతల్లో రైతులకు రూ. 6000 చెల్లింపు. దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.
* 2019-20లో ఉపాధి హామీ పథకానికి (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) కేటాయింపులు రూ. 60,000 కోట్లకు పెంపు
* 2018-19లో పేదలకు చౌకధరలకే ఆహారధాన్యాల సరఫరాకు రూ. 1.7 లక్షల కోట్లు వెచ్చించాం (2013-14లో రూ. 92,000 కోట్లు వెచ్చించారు)
* గ్రామాల ఆత్మను కాపాడుతూనే పల్లెల్లో పట్టణ సదుపాయాలు కల్పించాలన్నది ప్రణాళిక
* ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామాల రహదారుల నిర్మాణం మూడు రెట్లు పెంపుదల
* 2014లో 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సదుపాయం లేదు. కానీ నేడు అందరికీ విద్యుత్ సరఫరా
* దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు 143 కోట్ల ఎల్‌ఇడి బల్బులు అందుబాటులో ఉంచాం. తద్వారా రూ. 50,000 కోట్లు కరెంటు బిల్లు ఆదా చేశాం
* గోవుల ఉద్పాదకత పెంపుదలకు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఏర్పాటు
* 2014-18 మధ్యకాలంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 1.53 కోట్ల ఇళ్ల నిర్మాణం
* ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఇప్పటివరకు 10 లక్షలమంది రోగులు చికిత్స పొందారు
* దేశంలో 21 ఎయిమ్స్ నెలకొల్పగా, అందులో 14 ఎయిమ్స్‌ను 2014 తర్వాతనే ఏర్పాటు చేశాం. కొత్తగా హర్యానాలో ఎయిమ్స్ నెలకొల్పుతాం
జన్ ఔషధి స్టోర్ల ద్వారా అత్యంత సరసమైన ధరలకు మందులు అందజేత.
* ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అసంఘటితరంగ కార్మికులకు పింఛను పథకం అమలు. 42 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులమెగా పెన్షన్ స్కీమ్ ఇది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ నెలకు రూ. 3,000 పింఛను అందజేత.
* పేద, భూమిలేని రైతులకు నిర్మాణాత్మకమైన ఆదాయ తోడ్పాటును అందించేందుకు కృషి
* ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న రైతులకు రుణాల రీషెడ్యూల్, 2 శాతం రాయితీతో రుణాలు, నిర్ణీత కాలవ్యవధిలో రుణాలు చెల్లించినవారికి 3 శాతం రాయితీ
* గ్రాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపుదల
* ముద్ర యోజన లబ్ధిదారుల్లో 75 శాతంపైగా మహిళలే
* ఉజ్వల యోజన ద్వారా ఉచిత వంటగ్యాసు కనెక్షన్ ఒక గొప్ప విజయగాథ
* ఉజ్వల కింద 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, అందులో 6 శాతం కనెక్షన్లు పేద మహిళలకే ఇవ్వడం జరిగింది
* ముద్ర యోజన కింద 75 శాతం మహిళలు ఉండటమే కాకుండా, మహిళల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచాం. ప్రధానమంత్రి మంత్రిత్వ యోజనలో అందరూ సాధికార మహిళలే
* ముద్ర యోజన కింద ప్రభుత్వం 7.23 లక్షల కోట్ల రూపాయల మేరకు 15.56 లక్షల రుణాలను మంజూరు చేయడం జరిగింది
* భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్‌ల హబ్‌గా అవతరణ
* ప్రభుత్వ నైపుణ్య చొరవల కింద కోటిమందికి పైగా యువతకు శిక్షణ
* ప్రస్తుతం దేశంలో 100 విమానాశ్రయాలు నడుపుతుండగా, గత ఐదేళ్లలో ప్రయాణికుల రద్దీ రెట్టింపు
* రోజుకు 27కి.మీ. మేరకు రహదారుల నిర్మాణం, దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ పరిపూర్తి, సాగరమాల ప్రాజెక్టు శీఘ్రరీతిలో కార్ల ఎగుమతి, దిగుమతులకు దోహదం.
* కోటి రూపాయల వరకు రుణాన్ని కేవలం 59 నిమిషాల్లో పొందవచ్చు
* భారత రైల్వేల చరిత్రలోనే ఈ ఏడాది సురక్షితమైన సంవత్సరంగా గుర్తింపు. బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌లో అన్ని మానవ రహిత క్రాసింగ్‌లన్నీ తొలగింపు
* 2019-20లో రక్షణ బడ్జెట్ రూ. 3 లక్షలకు పెంపుదల
* గత మూడేళ్లలో ఒఆర్‌ఒపి కింద రూ. 35,000 కోట్లు ఇచ్చాం
* ఈ ఏడాది పన్ను వసూళ్లు రూ. 12 లక్షల కోట్లకు పెరుగుదల, 6.85 కోట్ల రిటర్న్ దాఖలు
* సైనిక సేవా చెల్లింపుల్లో గణనీయమైన పెరుగుదలను ప్రకటించడం జరిగింది
* పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ సరళీకరణ. ప్రత్యక్ష పన్నులను తగ్గించాం. పన్ను అంతర్ముఖ వ్యవస్థను సరళీకరించాం
* వచ్చే రెండేళ్లలో వ్యక్తిగత హాజరు లేకుండానే ఎలక్ట్రానిక్ విధానంలోనే పన్ను రిటర్న్‌ల పరిశీలన, చెల్లింపులు
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వే మూలధన వ్యయం రూ. 1.58 లక్షల కోట్లకు పెంపుదల, ఇది ఆల్‌టైమ్ రికార్డు
* పౌరులకు వేగాన్ని, సేవలను, భద్రతను కల్పించేలా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దోహదం. ఇది మేకిన్ ఇండియా భావనకు ఊతం
* ఐటి రిటర్న్‌లో 99.54 శాతం పరిశీలన లేకుండానే ఆమోదం, 24 గంటల్లో ప్రక్రియ పూర్తి, పన్నుల సరళీకరణకు అదే ఉదాహరణ
* దిగుమతులను తగ్గించుకునేలా స్వదేశీ చమురు, గ్యాసు ఉత్పత్తి తక్షణ మెరుగుదలకు చర్యలు.
కేంద్ర బడ్జెట్ ప్రధానాంశాలు
RELATED ARTICLES