కాంగ్రెస్ నాయకుడు నసీం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ… మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేకు స్మారకం నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. . గాంధీ హంతకుడికి స్మారకం నిర్మించాలనే ఆలోచన పరమ తప్పని, ఎంతమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు.
థానేలో నాథూరామ్ గాడ్సే స్మారకం నిర్మాణంపై చర్యలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. కల్యాణ్ సమీపంలోని సపర్దే గ్రామంలో ఇందుకోసం భూమిని కూడా కేటాయించారు. ఈ నిర్ణయంతో ‘హిందూ మహాసభ దేశంలోని 125 కోట్ల మంది ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోంది అని అన్నారు.గాడ్సే స్మారక భవనం ప్రతిపాదనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఒకవైపు మహాత్మాగాంధీ గొప్పతనాన్ని వారు శ్లాఘిస్తూ, మరోవైపు ఆయన హంతుకుడికి స్మారకం కట్టిస్తామంటారు. ఇది చూస్తే తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ద్వంద్వం వైఖరి అని విమర్శించారు. ముఖం మీద రాముడిని, మనసులో నాథూరామ్‌ను అనుసరించడం వారి వైఖరిగా మారిందని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని గట్టిగా చెప్పారు.
మహాత్మాగాంధీని కాల్చిచంపిన వాడికి స్మారకమా? ఎంతటి తప్పు..??
RELATED ARTICLES