రీ డిజైన్ పేరిట 40వేల కోట్లు మింగేసిన కెసిఆర్
రాష్ట్ర సంపద కెసిఆర్ కుటుంబానికే
500కోట్లతో గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక నిధి
బీడి ఉత్పత్తులపై జిఎస్ ఎత్తివేత
ఎన్నికల అనంతరం కెసిఆర్ ఫాంహౌజ్
తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నిజం చేస్తుంది కాంగ్రెస్
ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ
ప్రజాపక్షం / నిజామాబాద్ : తెలంగాణ ప్రజలు అనేక త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం అందుకు అనుగుణంగా ప్రజల కలలను కెసిఆర్ ప్రభుత్వం పరిపాలన జరగ లేదని ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల ఆశలను వమ్ముచేయడమే కాకుండా దగా చేశారని ఆయన మండి పడ్డారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపటిట్టిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు పేరు మార్చి 50వేల కోట్ల నుండి 90వేల కోట్లకు పెంచారని, అదనంగా పెంచిన 40వేల కోట్లు కేవలం కెసిఆర్ కుటుంబానికేనని ఆయన వెల్లడించారు. కాళేశ్వరంగా పేరు మార్చకుని సంపాదనే లక్షంగా కుటుంబానికి దోచిపెట్టాడని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో పనులు చేపట్టినట్టు మాట్లాడుతున్న కెసిఆర్ పాత చెరువులు, నీటి ట్యాంకులకు రంగు అద్డడం జరిగిందన్నారు. ఈ పథకాల వల్ల ఆదాయం మొత్తం ప్రజలకు కాకుండా ఆయన కుటుంబానికే దక్కిందని రాహుల్ వెల్లడించారు. మిషన్ కాకతీయ, భగీరథలో కెసిఆర్ నిర్వచనం కావో కమీషన్ రావుగా రాహుల్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపద మొత్తం కెసిఆర్ కుటుంబానికి మరలించారని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడే నాటికి 17వేలకోట్లు మిగులు ఆదాయం ఉంటే కెసిఆర్ నాలుగున్నర పరిపాలనలో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని ఆయన వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి వ్యక్తిపై 50వేల అప్పు ఉందన్నారు. దోపిడీలో కెసిఆర్, మోడి ఒకే విధానాలు అవలంభిస్తున్నట్టు రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాదాకరమని, రాష్ట్రంలో 4500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన వివరించారు.