న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు, మహాకూటమికి మధ్యనే పోరు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని, ప్రతిపక్షాల ఈ అభివృద్ధిలో కొట్టుకుపోతాయని చెప్పారు. న్యాయప్రక్రియ పూర్తయిన తర్వాతనే రామమందిరంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉర్జిత పటేల్ ఆర్బిఐ గవర్నర్గా రాజీనామా చేయడం వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు 6, 7 నెలల క్రితమే తమకు సమాచారమిచ్చినట్లు చెప్పారు. మెరుపుదాడుల వెనుక ఎలాంటి ప్రత్యేక ఉద్దేశాలు లేవని, సైనికుల భద్రతను దృష్టిలో వుంచుకొని రెండుసార్లు ఈ దాడులను వాయిదా వేసినట్లు గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలకు, మహాకూటమికి మధ్యనే పోరు : మోడీ
RELATED ARTICLES