ఒక మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడం కోసం అన్యాయంగా ఒక బాలికని చంపేసింది. వివాహేతర సంబంధం కోసం బాలికను ఎందుకు చంపిందో తెలియాలంటే అసలు జరిగింది ఏమిటో తెలుసుకుందాం… మహబూబాబాద్‌లోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన పువ్వల భవ్యకు 15 ఏళ్ల క్రితం తన మేనమామ పూర్ణచందర్‌రావుతో పెళ్ళయ్యింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భవ్య బైపాస్ రోడ్డులో చిన్నహోటల్ నడుపుతోంది.
కొంతకాలానికి భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా హోటల్ ఎదురుగా ఉన్న అమ్మా ట్రాన్స్‌పోర్టుకు వచ్చే విజయవాడ పడమటకు చెందిన జంగిలి శ్రీనివాస్‌తో భవ్యకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో అతనితో కలిసి విజయవాడ వెళ్ళిపోయింది. ప్రియుడితో ఉంటున్న ఆమెను కుటుంబ సభ్యలు తీసుకువచ్చారు. అయినా కూడా ఆమె ఆ రిలేషన్ వదులుకోలేక విజయవాడ వెళ్తుండేది.
కొన్నిరోజులు తరవాత ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తన స్థానంలో ఎవరినైనా చంపేసి, తాను చనిపోయినట్టు నిరూపించి, ఇక ఎవరి అడ్డు లేకుండా ఆ ప్రియుడితో ఉండిపోవచ్చని ఐడియా వేసి ప్రియుడి సహాయంతో ఆలోచన అమలు చేసింది. ఈ దుర్మార్గపు ఆలోచనకి ఓ 8 ఏళ్ల బాలిక భలైపోయింది. తన హోటల్‌కు చాక్లెట్ కోసం వచ్చిన ఓర్సు అనూష(8)పై భవ్య కన్ను పడింది.
ఆమెకు మాయమాటలు చెప్పి తన నైటీ ఇచ్చి, ఆమెను వేసుకోమంది. తరువాత ఇంట్లోకి తీసుకెళ్లి కర్రతో అనూష తలపై బాదడంతో స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత అనూషపై భవ్య కిరోసిన్ చల్లి నిప్పంటించింది. పెద్దమ్మ విజయలక్ష్మితో కలసి భవ్య… శవాన్ని సంచిలో మూటకట్టి ఆటోలో తీసుకెళ్లి ఈదులపూసపల్లి నల్లాల బావిలో పడేసింది. బాలిక తల్లితండ్రులు వాళ్ళ పాప కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వగా… పోలీసులు ఆరా తీయగా ఆ బావిలో దొరికిన శవం బాలికదేనని కనిపెట్టారు. ఈ హత్య కేసులో భవ్య,జంగిలి శ్రీనివాస్, కస్తూరి విజయలక్ష్మి నిందితులుగా తేలడంతో… వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలన్నీ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.
అక్రమ సంబంధం కోసం అన్యాయంగా బాలిక హత్య…
RELATED ARTICLES