ముంబయి : లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రధాని మోడీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే వలస కార్మికులు ఉవ్వెత్తున లేచారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే పూర్తిగా చితికిన బతుకులతో జీవనం సాగిస్తున్న రోజువారీ కూలీలు ముంబయిలోని బాంద్రాలో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వేలాది మంది రోడ్డుపైకి వచ్చి నినదించారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ బస్టాండ్ల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తవాతావరణం నెలకొన్నది. పోలీసులు వారిని నిరుపేదలని చూడకుండా లాఠీఛార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ కార్మికులంతా పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. పోలీసులు వారిని చెదరగొట్టి, ఆ ప్రాంతంలో శానిటైజ్ చేశారు.
వలసెత్తిన జనం!
RELATED ARTICLES