HomeNewsBreaking Newsలాక్‌డౌన్‌ మరింత కఠినతరం!

లాక్‌డౌన్‌ మరింత కఠినతరం!

అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై నిఘా
కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో కట్టుదిట్టంగా అమలు
ప్రాంతాల పరిస్థితిని వీడియోకాల్స్‌తో వివరించేలా చర్యలు
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింతగా కఠినంగా అమలు చేయనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో రా్రష్ట్ర వ్యాప్తంగా ఈ లాక్‌డౌన్‌ మరింత కఠినతరం కానుంది. రాష్ట్రంలో ఎక్కువవగా పాజిటివ్‌ కేసులు పెరిగిన ప్రాంతాలపై నిఘా ను కట్టుదిట్టం చేస్తున్నారు. హైదరాబాద్‌ సహా కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సరిగా అములు కావటంలేదనే అంశం కేంద్రం దృష్టికి పోవడంతో, ఆ ప్రాంతాలపై దృష్టి సారించాలని కేంద్రం అధికారులకు సూచించినట్లు సమాచారం. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు వీడియోకాల్స్‌తో వివరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించించింది. హైదరాబాద్‌లో పాతబస్తీతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పేరుతో ఇప్పటికీ జనాలు రోడ్లపై వస్తునే ఉన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో దేశవ్యాప్తంగా మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. ఆదివారం వరకు 334 కేసులు నమోదు కాగా అందులో హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి అధిక కేసులు నమోదయ్యాయి. మార్చి31 నుంచి రాష్ట్రాంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత వారం రోజుల్లోనే 190 కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈనేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్ల నగరాల్లో హైదరాబాద్‌ను చేర్చిన కేంద్రం, హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను సీరియస్‌గా అములు చేయాలని తెలిపింది. పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సమగ్రంగా అమలు కావట్లేదని కేంద్రానికి నిఘా వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరుపై వీడియో రికార్డింగ్‌ తీసి పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలంగాణ అధికారులను ఆదేశించినట్లు తెలిసిం ది. ఎక్కడైతే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయో… ఆయా ప్రాంతాలకు వెళ్లి అవసరమైతే తమకు వీడియో కాల్స్‌ ద్వారా అక్కడి పరిస్థితిని వివరించాలని సూచించింది. అయితే రాష్ట్రంలో మార్చి 31 నుంచి నమోదవతున్న కేసుల్లో ఒకటి రెండు మినహా మర్కజ్‌ వ్యవహారంతో ముడిపడి ఉన్నవే ఎక్కువ. శనివారం నాటికి హైదరాబాద్‌లో యాక్టివ్‌ కేసులు 93 ఉంటే ఆదివారం నాటికి యాక్టివ్‌ కేసులు 145కు చేరినట్లు వైద్యరోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్‌లో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 11 మరణాల్లో హైదరాబాద్‌ పరిధిలో ఏడుగురు చనిపోయారు. మృతి చెందిన కేసులు, డిశ్చార్జ్‌ అయిన 11 మందితో కలిపితే హైదరాబాద్‌లో  కరోనా బారినపడ్డ వారి సంఖ్య 163కు చేరుతోంది. అలాగే ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోనూ 24 వరకు కేసులు నమోదయ్యాయి. సోమవారం కూడా హైదరాబాద్‌ పరిధిలో మరికొన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మార్చి 31 ముందు విదేశాల నుంచి వచ్చిన వారితో ఒకటిరెండు కేసులు మాత్రమే నమోయద్యేవి. కానీ మర్కజ్‌ వ్యవహారంతో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దేశమంతా లాక్‌డౌన్‌ విధించే సమయానికి తెలంగాణలోని ఐదారు జిల్లాల్లోనే కరోనా కేసులు నమోదు కాగా, మార్చి 26 నుంచి రాష్ట్రంలో ఢిల్లీతో లింక్‌ ఏర్పడిన తరువాత కేసుల సంఖ్య వేగంగా బయటపడుతూ వస్తున్నాయి. దీంతో కరోనా ప్రభావం రాష్ట్రంలోని 24 జిల్లాలకు పాకింది. నిజామాబాద్‌ జిల్లాలో 19, నల్లగొండ జిల్లాలో 13, వరంగల్‌  అర్బన్‌లో 23, ఆదిలాబాద్‌లో 10 కేసులు ఆదివారం వరకు నమోదయ్యాయి. ఇతర జిల్లాలో ఇప్పటి వరకు 10లోపే కేసులు నమోదయ్యాయి. మరిన్ని జిల్లాలకు కరోనా పాకే అవకాశాలుండటంతో లాక్‌డౌన్‌పై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. హైదరాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల నుంచి తాజా సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యకుటంబ శాఖ తీసుకుని ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీసింది. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో అధికారులు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పోలీసు శాఖ డ్రోన్లతో లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలిస్తోంది. రోడ్లపై జనాలు అనవసరంగా తిరగకుండా లాక్‌డౌన్‌ను సమర్ధంగా అమలుపరిచేలా  అధికారులు చర్యలు చేపడుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments