భువనేశ్వర్: ఒడిశాలో లాక్డౌన్ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఏప్రిల్14 వరకు లాక్డౌన్ అమలులో ఉన్న విష యం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కోవిడ్- సంక్షోభం కారణంగా అమలవుతున్న లాక్డౌన్ కాలంలో మీ క్రమశిక్షణ, త్యాగం కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి మా కు బలాన్ని ఇచ్చింది’ అని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రైళ్లు, విమానాల సేవలు ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు, జూన్17వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు సిఎం తెలిపారు. వ్యవసాయ ఆధారిత పనులకు మినహాయింపు ఉందన్నారు. కరోనా తర్వాత పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవని, ప్రజలంతా అర్థం చేసుకుని సహకరించాలని పట్నాయక్ కోరా రు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను కొనసాగించడం తప్ప మరో దారి లేదం టూ పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. దేశంలో లాక్డౌన్ ఎత్తివేసినా తెలంగాణలో మాత్రం కొనసాగించాలనుకుంటున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ సర్కార్ కూడా దీనిపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.కరోనాను పూర్తి గా కట్టడి చేశాకే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందంటూ ప్రభు త్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్థాన్ ప్రభుత్వం కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.
ఒడిశాలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
RELATED ARTICLES