మద్దెలచెర్వు సూరి హత్య కేసులో తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్ : 2014లో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు జీవితఖైదు, రెండో నిందితుడు మన్మోహన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. సూరి హత్య కేసులో ఆరున్నరేళ్లుగా భానుకిరణ్ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. అయితే, మన్మోహన్ కూడా జైలులో ఎనిమిదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. భానుకిరణ్‌కు జీవితఖైదు, మన్మోహన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం.. ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీధర్, వెంకటరమణ, సుబ్బయ్య, హరిలను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు విచారణలో సిఐడి పోలీసులు 93 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.