హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో టిఆర్‌ఎస్‌ను విభేదించి కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో మురళి ఎంఎల్‌సి సభ్యత్వాన్ని రద్దు చేయాలని టిఆర్‌ఎస్ ప్రతినిధులు మండలి చైర్మన్‌ను కోరారు. దీంతో మురళీ తనంతట తానుగా శనివారం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కొండా మురళి దంపతులు శుక్రవారం కలిసి రాజీనామా లేఖను అందజేశారు. దీంతో చైర్మన్ స్వామిగౌడ్ మురళి రాజీనామాను ఆమోదించారు. రాజీనామా లేఖ అందజేసిన అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి ఏకగ్రీవంగా తానే గెలిచానని చెప్పారు. విలువలు పాటించే నాయకుడిని కాబట్టే రాజీనామా చేశానన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కెసిఆర్ చూస్తున్నారని ఆరోపించారు. తాను, సురేఖ రాజకీయాల్లో విలువలతో బతుకుతున్నామని, తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ప్రజల మధ్యే ఉంటామని చెప్పారు. సురేఖ మాట్లాడుతూ.. కెసిఆర్ ఇచ్చిన బిఫారంపై కొండా మురళి గెలవలేదని, ప్రజల అండతోనే ఎంఎల్‌సిగా గెలిచారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో టిఆర్‌ఎస్ గెలిచిందని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి కోసం జూపల్లిని ఓడించారని ఆరోపించారు.
ఎంఎల్‌సి పదవికి కొండా మురళి రాజీనామా
RELATED ARTICLES