అమరావతి: ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ సైకిల్ ఎక్కారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు టిడిపిలో చేరారు. కాగా, కాంగ్రెస్ పార్టీని ఇటీవలే వీడిన కిశోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరుతున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్న కిశోర్ చంద్రదేవ్ ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2011 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో గిరిజన వ్యవహరాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
సైకిల్ ఎక్కిన కిశోర్ చంద్రదేవ్
RELATED ARTICLES