న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం నాడు ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్ చంద్రదేవ్ మీడియాతో మాట్లాడుతూ టిడిపిలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో టిడిపి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్ చెప్పారు. ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
టిడిపిలోకి కిశోర్ చంద్రదేవ్
RELATED ARTICLES