రెండోసారి సిఎంగా కెసిఆర్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కెసిఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు కెసిఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను..’ అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కెటిఆర్, హరీశ్‌రావుతో పాటు కెసిఆర్ కుటుంబ సభ్యులు, మహమూద్ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్ ఎంపీలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు.
కాగా, కెసిఆర్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసారి మాత్రం కెసిఆర్‌తో పాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.