కొనసాగించాలన్నది నా అభిమతం
ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి కూడా చెప్పా
జూన్ 3 వరకు లాక్‌డౌన్ వుండాలన్నది ఓ సర్వే చెప్పింది
మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ స్పష్టీకరణ
వైద్యులకు, జిహెచ్‌ఎంసి సిబ్బందికి ప్రోత్సాహకాలు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తే ఆగమాగమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నాళ్లపాటు లాక్‌డౌన్ కొనసాగాల్సిందేనని, ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి కూడా చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం, లాక్‌డౌన్ పరిస్థితులపై కెసిఆర్ సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో మా ట్లాడారు. “కరోన వైరస్ వ్యాధి ప్రబలడం ప్రారం భం అయ్యాక కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయంగా వచ్చిన సూచనలు, సలహాలు పాటించారు. ఈ జబ్బు మన దగ్గర పుట్టింది కాదు కాబట్టి వెనుక, ముందు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్, జనతా కర్ఫ్యూ పాటించింది. దీనితో మన దేశం చాలా గొప్పగా ఉంది. మన దేశం చాలా సేఫ్‌గా వుందని అంతర్జాతీయ జర్నల్సే చెప్తున్నాయి. వివిధ పార్టీలు ఉన్నప్పటికీ చాలా గొప్పగా ఐక్యత పాటిస్తున్నాం. అమెరికా లాంటి ధనిక దేశంలో శవాల గుట్టలు గుట్టలగా పేరుకోపోతున్నాయి. ట్రక్‌లలో శవాలు పంపిస్తున్నారు, శవాలకు దిక్కు లేదు, అన్నింటిలో ముందు ఉన్న దేశం అమెరికా ఇంత దారుణంగా ఉండటం బాధాకరం. మన దేశంలో ఇతర దేశా ల నుంచి వచ్చిన వారి ద్వారా ఇతరులకు సోకిన వారు 25,937 మందిని క్వారంటైన్ చేశాం. ఇందులో 50 మందికి కరోన పాజిటివ్ వచ్చింది. వాళ్ళ నుండి వారి కుటుంబ సభ్యులకు సోకించారు, ఇందులో ఒక్కరు కూడా చనిపోలేదు, ఇందులో 35 మంది వ్యాధి నుండి కొలుకున్నారు. ఇందులో ఎవరు కూడా సీరియస్‌గా లేరు. క్వారయింటైన్‌లో ఉన్న వారిలో పాతవారిని 9వ తేదీ నాటికి డిశ్చార్జ్ చేస్తాం. మధ్యలో వచ్చిన నిజముద్దీన్ కేసులు దేశం మొత్తం కూడా అతలాకుతలం చేశారు. మొత్తం 364 మందికి సోకింది. ఇండోనేషియా వాళ్ళు కూడా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది చనిపోయారు. గాంధీలో 308 మంది ట్రీట్మెంట్‌లో ఉన్నారు. నిజముద్దీన్ 1089 మందిని పెట్టుకున్నాం. 30 నుండి 35 మంది ఢిల్లీలో ఉంటారు. వారికి అక్కడే ట్రీట్మెంట్ చేసి ఉంటారు. ఇందులో 170 మందికి వైరస్ వచ్చింది చనిపోయిన వారు కూడా ఇందులో వారే. 170 మంది ద్వారా 90 మందికి వచ్చింది. సుమారు 3015 మందిని పట్టుకున్నారు. అందరూ కూడా ఒకే మతం వారు లేరు. హిందువులు కూడా ఉన్నారు. 308 హాస్పిటల్‌లలో ఉన్నారు. 1000 మందికి ఎలాంటి జబ్బు లేదు. ఇంకా కొంత మందికి టెస్ట్ లు జరుగుతున్నాయి .వచ్చే రెండు,మూడు రోజుల్లో అన్ని పరీక్షలు వస్తాయి. వీళ్ల ద్వారా ఎవరికి అయిన సోకిందా అని వేట కొనసాగుతుంది. ఇంటలిజెన్స్ చాలా కష్టపడ్డారు. 308 మంది కాకుండా ఇంకో 110 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు ఆగిపోతుందని దేవుణ్ణి కోరుతున్న. లాక్ డౌన్‌కు ప్రజలు చాలా సహకారాన్ని అందించారు. ఇంకా సహకారం ఇవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు లాక్‌డౌన్ చేశాయి. మిగతా 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ చేశాయి. దీన్ని బట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంతో పాటు దేశం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లో శవాల గుట్టలు చూడలేకపోతున్నాం. అప్పట్లో యుద్ధం జరుగుతే ఇలా ఉండేది.అంత శక్తివంతమైన దేశంలో అలా జరిగింది.
జూన్ 3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలన్నది సర్వే
“ఇటీవల బిసిజి సర్వే వచ్చింది. వాళ్ళ లెక్క ప్రకారం ఇండియాలో జూన్ 3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలి చెప్పారు. జూన్ 3 వరకు ఇండియాలో వైరస్ పీక్‌స్టేజ్‌కు వెళ్తుంది అని చెప్పారు. మన లాంటి దేశాలు లాక్ డౌన్ పాటించాలని చెప్పారు. మనకు కూడా వేరే గత్యంతరం లేదు. ఎకానమీ పడిపోతుంది. తెలంగాణకు రోజుకి 440 కోట్ల ఆదాయం రావాలి. మార్చ్ రెండో వారం నుంచి ఆదాయం నిల్. ఏప్రిల్ లో 2వేల 4వందల కోట్ల ఆదాయం రావాలి కానీ 4 కోట్లు వచ్చింది. అయినప్పటికీ ఇండియాకు లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదు. లాక్‌డౌన్ ఎత్తివేతపై అనేక చర్చలు జరుగుతున్నాయి. నా లెక్క ప్రకారం కొనసాగించాలి. ప్రధాని మోడీతో రోజుకు రెండు సార్లు మాట్లాడుతున్నా. ఇదే విషయంపై ఆయనకు విజ్ఞప్తి చేశా. లాక్‌డౌన్ ఎత్తేసి అన్నీ తెరిస్తే ఒక్కసారిగా జనాలు కుప్పలు కుప్పలుగా వస్తారు. వాళ్ళను ఎవరు కంట్రోల్ చేయాలి. ఇంతకు ముందు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి లేదు. ప్రజలకు దండం పెట్టి చెపుతున్న. స్టార్టింగ్ స్టేజీలో వస్తే కంట్రోల్ అవుతుంది. లేదంటే వైరస్ వ్యాప్తి చెందితే తొందరగా చనిపోతున్నారు. మోడీ అడిగితే లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పాను. ఒక్కరు చనిపోతేనే ఇల్లు మొత్తం దిక్కులేకుండా పోతుంది. అలాంటిది లక్షల్లో చనిపోతే ఎలా?
వైద్య సిబ్బందికి సిఎం గిఫ్ట్
కరోనాపై యుద్ధంలో అందరికీ మించి తమ ప్రాణాలకు తెగించి, తమ వ్యక్తిగత వ్యవహారాలను పక్కనబెట్టి వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని వైద్య సిబ్బంది అందరికీ (ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసిన వారినుంచి డైరెక్టర్ వరకు) రాష్ట్ర ప్రజల తరఫున నేను రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. వారికి పాదాభివందనం. వారి ధైర్యం గొప్పది. వాళ్లు చాలా గొప్పవాళ్లు. అనేక రూపాల్లో పనిచేస్తున్నారు. వాళ్లను ఎంత పొగిడినా, దండం పెట్టినా తక్కువే. వైద్య సిబ్బందిని పొగిడే నోళ్లు కావాలిప్పుడు. కొవిడ్- 19 వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్య శాఖ సిబ్బందికి మొన్న పూర్తి వేతనం ఇవ్వాలని చెప్పాం. వారి సేవలను గుర్తించి తాజాగా సిఎం గిఫ్ట్ కింద వాళ్లందరికీ 10శాతం గ్రాస్ శాలరీ ఇస్తున్నాం. వాళ్లకు వెంటనే డబ్బులు అందజేస్తాం. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడాం. వాళ్లకు వెంటనే అందజేస్తాం. ఈ మేరకు జీవో విడుదల చేస్తాం. పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ధన్యవాదాలు.