ప్రజాపక్షం/హైదరాబాద్: సహస్రచండీ మహాయాగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం యజ్ఞ వాటికలో వేదోక్తంగా సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా తరలివచ్చిన శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి సమక్షంలో యజ్ఞం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే చండీయాగంలో భాగంగా మొదటి రోజు కర్నాటకలో శృంగేరి పీఠానికి చెందిన తంగిరాళ సీతారామ శాస్త్రీ, మాడుగుల మాణిక్య సోమయాజులు, బుగ్వేద పండితులు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు యాగానికి వేదిక సారధ్యం వహించారు. సుమారు 300 మంది ఋత్విజులు దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించేందుకు ముందుగా నిర్వఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1000 మోదకాలతో ప్రత్యేక వాహానాన్ని ఏర్పాటు చేశారు. సిఎం కెసిఆర్ దంపతులుకార్యక్రమానికి ముందుగా యజ్ఞవాటిక చుట్టూ ఋత్విజులు వేద మంత్రాలు వల్లిస్తుండగా ప్రదక్షిణం జరిపి చండీ యజ్ఞ వాటికలో పుణ్యాహవచణం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మదించడం ద్వారా రగిలిన నిప్పుతో నాలుగు యజ్ఞాలను ప్రారంభమయ్యాయి.తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు పూజలు నిర్వహించారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవుంతుణ్ని వారు ప్రార్ధించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 300 మందికి పైగా ఋత్వికుల ఆధ్వర్యం లో యాగం అత్యంత సాంప్రదాయబద్దంగా జరుగుతున్నది. సుమారు 3గంటల పాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయోవృద్ధ దంపుతులకు, దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలను సిఎం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్‌అలీ, టిఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు, మెదక్ ఎంపి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎంఎల్‌ఎలు, వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ యజ్ఙం శుక్రవారం మధ్యాహ్నాం జరిగే పూర్ణాహుతితో ముగుస్తుంది.
సిఎం సహస్ర చండీయాగం ప్రారంభం
RELATED ARTICLES