HomeNewsLatest News19న రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

19న రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

ప్రజాపక్షం / హైదరాబాద్‌  : ఈ నెల 19న మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ర్ట క్యాబినెట్‌ సమావేశం జరగనుంది.  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చిస్తారు. అలాగే రాష్ర్టంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు యధావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments