నిరుద్యోగులకు శుభవార్త… ఈనెల 25 న 25 కంపెనీల జాబ్ మేళా ఉంది. ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 25 న గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు శాఖ జిల్లా అధికారి కే రజనీప్రియ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పది, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారంతా హాజరు కావచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, 25 కంపెనీల ప్రతినిధులు వారికి కావాల్సిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు.
అభ్యర్థులు ఎన్‌సీఎస్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 0863-2350060 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.