HomeSci & TechTechnologyరిలయన్స్ జియో మరో బంపర్ ప్లాన్…

రిలయన్స్ జియో మరో బంపర్ ప్లాన్…

రిలయన్స్ జియో ఆఫర్లు అంటే ఎంతో ఆశక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే కష్టమర్స్ కి ఎంతో దగ్గరగా వెళ్లి, వారికి ఇలాంటి ఆఫర్ అయితే చాలా బాగా అట్రాక్ట్ అవుతారనే ఎస్టిమేషన్ తోనే, ప్రకటనలతో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు రిలయన్స్ జియో… తన నాన్ ప్రైమ్, ప్రైమ్ కస్టమర్లకు మరో అవకాశం ఇచ్చింది.

ఏప్రిల్ 10 వరకు ఉచిత జియో సర్వీసులు పొంది.. ప్రైమ్ లో చేరని కస్టమర్లు.. రూ. 99 రీఛార్జ్ తో జియో ప్రైమ్ మెంబర్ గా జాయిన్ అయిన తరవాత ఏ ఇతర రీఛార్జ్ ప్లాన్స్ చేసుకోని కస్టమర్లకు జియో చిట్ట చివరి అవకాశం ఇచ్చింది. వీళ్లకోసం జియో గ్రేస్ ప్లాన్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ గ్రేస్ ప్లాన్ లో రూ. 309, రూ. 349, రూ. 549లో ఏదో ఒకటి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రీఛార్జ్ చేసుకున్న దగ్గర నుంచి 84 రోజుల పాటు ఆయా ప్లాన్స్ ప్రకారం జియో సర్వీసులను పొందవచ్చు. జియో గ్రేస్ ప్లాన్ లో ఉన్నవారికి  128 కేబీపీఎస్ నెట్ స్పీడ్ తో పాటు, జియో నెట్ వర్క్, ఉచిత కాల్ (2లక్షల 59 వేల 200 నిమిషాలు) సదుపాయం(జియో టు జియో మాత్రమే), రోజుకి 100 SMS లు లభిస్తాయి. దీని గడువు అక్టోబర్ 12గా నిర్ణయించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments