ఖుషినగర్: భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం సోమవారం నాడు కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది. కూలిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఫైటర్ జెట్ నుంచి పైలట్ పారాచూట్ సహాయంతో సురక్షితంగా బయట పడ్డాడు. ఈ యుద్ధ విమానం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వాయుసేన స్థావరం నుంచి బయలుదేరిన అనంతరం ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
కూలిన జాగ్వార్ యుద్ధ విమానం
RELATED ARTICLES