బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. తన పిల్లల పెదాలు కోసేస్తాడు…వాళ్లని ముద్దు పెట్టవద్దని హెచ్చరిస్తాడు. జనాలకు మాత్రం పచ్చి బూతు మాటలు చెబుతాడు అని విమర్శిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. . ‘జబ్ హరీ మెట్ సెజల్’ చిత్రంలో ఓ సీన్‌లో పచ్చి బూతు మాటను పలికాడు. ఆ పదాన్ని తొలగించాలని సెంట్రల్ సెన్సార్ బోర్డు ఆదేశించి, చిత్రానికి ఏ/యూ సర్టిఫికేట్ జారీ చేసింది.
ఆ పదాన్ని తొలగించడానికి చిత్ర నిర్మాతలు సరే అన్నారు. అయితే ఆ పదాన్ని తొలగించనట్టు చిత్రం బృందం సెన్సార్ బోర్డుకు చెప్పలేదు. చిత్రం విడుదలకు అన్నీ సెట్ చేసుకున్నారు. ఇది తెలిసిన సెన్సార్ బోర్డు ఆ చిత్రం రిలీజ్‌ను ఆపేసింది. అయితే సెన్సాన్ బోర్డు పెట్టిన నిబంధనలతో నిర్మాతలను నిరుత్సాహపరిచింది. షారూక్ ఖాన్ చేత ఎంతో అద్భుతమైన పచ్చి బూతు పదాన్ని పలికిస్తే, తమ అభిరుచికి ఇలా దెబ్బతగులుతుందని ఊహించలేదు వాళ్ళు పాపం..