కన్నడ నటీనటుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు
బెంగళూరు: కన్నడ నటీనటుల ఇళ్లల్లో గురువారం ఉదయం నుంచి ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, నటుడు సుదీప్, పునీత్ రాజ్‌కుమార్, కెజిఎఫ్ ఫేమ్ యష్, కెజిఎఫ్ చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్, మరో నిర్మాత జయన్న నివాసాలు, కార్యాలయాలు మొత్తం 25 చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నారు. మన్యతా టెక్ పార్క్‌లోని పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివరాజ్‌కుమార్‌కు చెందిన ఇంట్లోనూ ఐటి అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.