న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ – మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం వీరికి సిబిఐ, ఇడి కేసుల్లో మధ్యంతర ఊరటను జనవరి 11 వరకూ పొడిగించింది. కేసుకు సంబంధించి మరిన్ని పత్రాలను సేకరించేందుకు సమయం కావాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మారిషస్ కంపెనీకి అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చట్టవిరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించారన్న సిబిఐ ఆరోపణలను నిరాధారమైనవని చిదంబరం కోర్టు ముందు పేర్కొన్నారు.