సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌లో భారత్ మరింత పట్టుబిగించింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 300 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టు ఫాలో ఆన్‌లో పడింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆట ముగిసే సమయానికి వికెట్టు నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కావాజా (4), హారిస్ (2)లు క్రీజ్‌లో వున్నారు. అంతకుముందు, భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలింది. కుల్‌దీప్ యాదవ్ 5 వికెట్లు, జడేజా, షమీలు రెండేసి వికెట్లు, బుమ్రా ఒక వికెట్టు తీసుకొని ఆసీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. ఆసీస్ బ్యాట్స్‌మన్‌లలో నాల్గవరోజు కమిన్స్ (25), స్టార్క్ (29), హజల్‌వుడ్ (21)లు మాత్రమే రాణించారు.