మెల్‌బోర్న్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ వన్డే మ్యాచ్ శుక్రవారంనాడు మెల్‌బోర్న్ క్రికెట్ కౌన్సిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ వన్డేలో ఈ జట్టు గెలిచినా సిరీస్‌పై పట్టుబిగిస్తుంది. అందుకే ఇరుజట్లు ఈ మూడో వన్డేపై కన్నేశాయి. మంగళవారంనాడు అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేయగా, భారత్ ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే 4 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ (104), మహేంద్రసింగ్ ధోనీ సమయోచితమైన బ్యాటింగ్ (55 నాటౌట్) భారత్‌ను గెలిపించాయి.
ఇక సిరీస్‌పైనే కన్ను!
RELATED ARTICLES