హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు భద్రత పెంచాలని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ డిజిపిని కోరారు. సోమవారం ఆయన డిజిపి మహేందర్‌రెడ్డిని కలిశారు. తమ పార్టీ నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు మధుయాష్కీ వెల్లడించారు. టిఆర్‌ఎస్ ఓటమి భయంతో తమపై భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, నాయకులు హర్కర వేణుగోపాల్‌లతో కలిసి మధుయాష్కీ డిజిపితో భేటీ అయ్యారు. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ నాయకులపైన జరిగిన దాడులకు సంబంధించి కేసులపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తాము ముందు నుంచి చెప్పిన్పటికీ భద్రత పెంచలేదని, అందువల్ల తనతోపాటు పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని డిజిపికి వివరించారు.
కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచండి
RELATED ARTICLES