ఇప్పుడంటే తెలుగు సినిమాలకు ఇలియానా దూరంగా ఉంది కాని, పోకిరి టైం లో టాలీవుడ్ లో టాప్ హీరొయిన్. ఆ తరవాత పెద్ద హిట్ సినిమాలు రాకపోవడంతో పాటు, ఫ్లాప్ లు ఎక్కువగా చవిచూడటం వలన హిందీ సినిమాలకు జంప్ అయ్యింది. అక్కడ కూడా ఎక్కువగా ఏమీ చేయలేదు కాని, ఏడాదికి రెండో మూడో సినిమాలు అయితే చేస్తుంది.
నాలుగేళ్ల క్రితం చేసిన బర్ఫీ సినిమా ఇలియానాకు మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత వరస బెట్టి ఆఫర్స్ వచ్చాయి కాని పెద్దగా ఆడిన సినిమా ఏది లేదు. తాజాగా ఇలియానా నటించిన సినిమా ముబారకన్ సినిమా ఫైనల్ స్టేజి లో ఉంది. అర్జున్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ పంజాబీ కుటుంబం నేపధ్యంలో సాగుతుంది. అర్జున్ కపూర్ బాబాయ్ అనిల్ కపూర్ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఇటీవలే దీనికి డబ్బింగ్ చెప్పిన ఇలియానా దానికి ఎంత కష్ట పడిందో యూనిట్ వర్గాల ద్వారా బయటికి వచ్చింది. దీనికి డబ్బింగ్ చెప్పడానికి ఇలియానా ఏకంగా పదకొండు గంటల పాటు నాన్ స్టాప్ గా ఎక్కడికి వెళ్ళకుండా తన అవసరాలన్నీ డబ్బింగ్ థియేటర్లోనే పూర్తి చేసుకుంటూ చెప్పిందట. కారణం ఏంటి అని ఆరా తీస్తే పంజాబీ నేపధ్యంలో ఉన్న సినిమా కాబట్టి ఆ బాష తనకు అంతగా రాదనీ అందుకే సంభాషణలు రాసిన రచయితను పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఎలా చెప్పాలి అని ప్రాక్టీసు చేసిందట. పదకుండు గంటల పాటు ఇలియానా నాన్ స్టాప్ గా డబ్బింగ్ దియేటర్ లో ఉండి పని చేయడం చిన్న విషయం కాదు మరి…