సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రా జిల్లా బిర్ బిల్లింగ్ వద్ద కొండచరియల్లో చిక్కుకున్న వంద మందిని సురక్షితంగా కాపాడామని అధికారులు తెలిపారు. శక్రవారం సాయంత్రం టూరిస్టులు 60 వాహనాల్లో వెళ్తుండగా పాయింట్ ఫైవ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగి గంటన్నరలో టూరిస్టులను రక్షించారని పేర్కొన్నారు. స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ సూపర్‌వైజర్ రన్‌విజయ్ నేతృత్వంలోని రెస్క్యూ సిబ్బంది గంటన్నరలో అందరినీ కాపాడారని బైజ్‌నాథ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రామేశ్వర్‌దాస్ తెలిపారు.
కొండచరియల్లో చిక్కుకున్న వంద మంది సురక్షితం
RELATED ARTICLES