వివాహము నందు తప్ప జీవితంలో ఎప్పుడు భార్యతో కలసి భర్త భుజించరాదు అని అంటారు. అలాగే పిల్లలకు, వృద్దులకు పెట్టకుండా ముందే తినరాదు. కాళ్ళు చాపి భోజనం చేయుట దోషం.
భోజనం చేసేటప్పుడు ఎవరు ఎన్ని ముద్దలు తినాలంటే…
సన్యాసి ఎనిమిది ముద్దలు తినాలి.
వివాహం అయిన వారు 16 నుండి ౩౨ ముద్దలు తినాలి.
బ్రహ్మచారికి సంఖ్యతో నియమం లేకుండా ఎన్ని ముద్దలు అయినా తినవచ్చు.
అహం వైశ్వానరో భూత్వాl
ప్రాణినాం దేహమాశ్రితః ll
ప్రాణిపాన సమాయుక్తః l
పచామ్యన్నం చతుర్విధం ll
ఈ శ్లోకం చదువుకుని అప్పుడు భోజనం చేయాలు. అన్నపూర్ణాదేవిని, గోవిందనామాన్ని స్మరించాలి.